#372ప్రభు ప్రార్థన
Author: విలియం డానన్Composer/Ragam: ఆనందభైరవిCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
ఓ మా తండ్రి నీదు నామము – నిత్యమెన్నున్ – చుండుగాక సకల లోకము
క్షేమముగను విమలముగను – జెనున్ మిరుగ బరలోక – ధాముడవై వెలయునట్టి – ధన్య సౌజన్యమాన్య || ఓ మా తండ్రి ||
1.
నీ రాజ్యంబు రా నిమ్ము – నీదు చిత్తము – నేటుగ బరలోకమందున
నే రీతిగను చేయంబడునో – యీ భూలోకమందునట్టి – దారి బొంద జేయవలెను – ధర్మమూర్తి సత్యవర్తి || ఓ మా తండ్రి ||
2.
నేటి యాహారంబు మాకు – గరుణ చేసి – నేటి కిచ్చి సూటి పరచుమి
మేటి మా విరోధి జనుల – మే మెట్లు క్షమింతుమటుల – మాటికనికి క్షమింప నీవే – మాకు వేరే లేరు సుమ్ము || ఓ మా తండ్రి ||
3.
మమ్ము శోధనమునకు తేకుము – కీడు నుండి – మరల జేయు మమ్ము నేమనెన్
ఇమ్మగు బల మహిమ రా – జ్యమ్ములును సర్వకా – లమ్ము నీవే మాదు ప్రార్థ – న నమ్ము జేకొమ్ము ఆమెన్ || ఓ మా తండ్రి ||