FaithWalk
← Back to Library

#370Nearer, my God to Thee

Author: శారా ఫ్లవర్ ఆడమ్స్Composer/Ragam: అనువాదం: బర్నార్డ్ లూకాస్Translator: బర్నార్డ్ లూకాస్Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
1.
నా దేవ ప్రభువా నీ చెంతను సదా వసింపను నా కిష్టము ఏవైన శ్రమలు తటస్థమైనను నీ చెంత నుందును నా ప్రభువా.
2.
ప్రయాణికుండను నడవిలో నా త్రోవ చీకటి కమ్మినను నిద్రించుచుండగా స్వప్నంబునందున నీ చెంతనుందును నా ప్రభువా.
3.
యాకోబు రీతిగా ఆ మెట్లను నా తండ్రి, నేను స్వర్గంబు జేరను నీకు గృతజ్ఞత జూడనిమ్ము. నీ దివ్య రూపమునే చావనొందగా ప్రోత్సాహపరచగా ఇదే నా కోరిక నీ చెంతనుందును నీ చెంతనుందును నా ప్రభువా.