FaithWalk
← Back to Library

#368క్రైస్తవుని విజయము

Author: ఎల్. జాన్ తాతయ్యComposer/Ragam: ఆనందభైరవి (చేయ: రాజులకు రాజైన)Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
భయము మేల క్రైస్తవుండా – నీవికనపజయమున బ్రతుకనేల జయ శూరుడగు ప్రభువు – ఇలనీకు జయము నిచ్చుచునుండగ || భయము ||
1.
భూతపీడితుల నెల్ల – విడిపించుదాత – మన రక్షకుడు – సాతాను వల నుండియు – విడిపించి నీతితో మనుపలేదా || భయము ||
2.
మరణ పాశముల నుండి – లాజరును – కరుణతో లేపలేదా – ధరణి మిమ్ముల నూతన – బలముతో – గురికి నడిపించలేదా || భయము ||
3.
ద్రాక్షారసముగా నీళ్ళను – మార్చిన – మహిమగల రక్షకుడు – అక్షయ సంతసంబు – నిలమీకు దీక్షతో నివ్వలేదా || భయము ||
4.
ఐదు చిన్న రొట్టెలు – మరి రెండు – చిన్న చేపలతోడును – ఐదు వేల మందిని – బలపరిచినట్టి రక్షకుడుండగ || భయము ||
5.
విజయకరముగా బ్రతుకను – ప్రభువుండు – నిజవాగ్దత్తము లివ్వ నీ – మృజినము గెలువంగను – ముదముతో నిజముగా నెరవేర్చడా || భయము ||