FaithWalk
← Back to Library

#360క్రైస్తవ లక్షణము

Author: మేడికాయల సాధువుComposer/Ragam: శంకరాభరణముCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
యేసు క్రీస్తు మతస్థుడననగా – నెరిగి మనుడి జగము లోపల వాసిగా ప్రభు యేసు దాసులే – పరమందు నివాసులగుదురు || యేసు ||
1.
యేసు క్రీస్తును నమ్మి యాయన – దాసుడై వర్తించు నాతడె భాసురంబుగా క్రైస్తవుండని – ప్రాకటంబుగా బరగుచుండును || యేసు ||
2.
ఎల్ల సమయములందు ధాత్రిని – యేసు నడతల నెరిగి నడుచుచు నుల్లమున రక్షకుని దాల్చిన – యోర్పరియే క్రైస్తవుడు సుమ్ము || యేసు ||
3.
క్రీస్తు నన్ను గొనెను గావున – క్రీస్తువాడను నేను అంచును క్రైస్తవుండు గొల్చు నాతని – వాస్తవమ్ముగా నాత్మ తనువుల || యేసు ||
4.
రాజులు యాజకులు శుద్ధులు – రాజనందను లనెడు పేళ్ళను రాజరాజు దేవుడొసగెను – రాజితంబు క్రైస్తవులకును || యేసు ||
5.
క్షయము లేనిది శుద్ధమైనది – వ్యయము లేనిది నిత్యమైనది దయను యేసుడొసంగు భాగ్యము – తప్పకుండా క్రైస్తవులకును || యేసు ||