FaithWalk
← Back to Library

#359క్రైస్తవ వీరులు

Author: ఎ. జెకర్యాComposer/Ragam: శంకరాభరణముCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
వీరులమయ్యా – జయ – వీరులమయ్యా – మా వైరిన్ జంప యుద్ధమాడు – శూరులమయ్యా || వీరుల ||
1.
మాంస లోక పిశాచి – హింసపరచిన – మమ్ము ధ్వంసము చేయ పైబడిన – ధ్వజము విడువమయ్యా || వీరుల ||
2.
పరమ గురువు అగు – యేసు – ప్రభువు నాజ్ఞను – బహు త్వరగా ప్రజకు బయలుపరచు – భటుల మేముమయ్యా || వీరుల ||
3.
అతి దుష్ట ద్రోహులు – మమ్ము – వెడల బెట్టిన – నీ స్తుతి సువార్త కొరకు కొంచెం – సిగ్గుపడమయ్యా || వీరుల ||
4.
భూలోక నాధులు – చాల – పోరు సల్పిన – మా వేలుపునకు ప్రాణమైన – బెట్టువారము || వీరుల ||