#361యేసునకు సాక్షులు
Author: చెట్టి భానుమూర్తిComposer/Ragam: ఆనందభైరవిCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
యేసుప్రభుకై – సాక్షులెవరెవరో – ఎవరెవరో యని – యాశతో ప్రభు – అడుగుచున్నాడు
యేసు కొరకై – నిలిచి క్రైస్తవ – యువకులల్లరు సాక్ష్యమిచ్చుచు – భాసురంబుగా – క్రీస్తు – నెంతో భారతీయులు ప్రస్తుతించారో || యేసుప్రభు ||
1.
దేవదర్శన మొంది లేలెండి – ధన జనుల కెల్లను – దైవ ప్రేమను గూర్చి దెలుపండి
పావనుండగు ప్రభుని బోధలు – పాడి రక్షణ మార్గమెల్లను సావధానముతోడ దెల్పారే – సౌలు మారి పౌలాయెనదో || యేసుప్రభు ||
2.
రాయబారుల – మంచు నమ్మండి – రారారు వార్తలు – రేయింబవలును దెలుప లేలెండి
పాయకుండగ – యేసు తన విమ – లాత్మ నెప్పుడు తోడ నుంచును –
పాపులల్లరు – యేసు ప్రభుని – పాదములు సేవించి బ్రతుకగ || యేసుప్రభు ||
3.
ధీరులై శుభవార్త చాటండి – దినదినము వాక్య ప్ర – చారమెల్లను చేయ లేలెండి
జయము మీదను – జయమునిచ్చి – జగతిని దగ వెలగ జేయగ || యేసుప్రభు ||
4.
పౌలు మాదిరి బోలి లేలెండి – పరలోక రాజ్య – ప్రచారమెల్లను చేయ లేలెండి
పలువిధంబుల శ్రమలకోర్చి – ప్రభువు శత్రుల నెల్ల మాడ్చి – సిలువ
ధ్వజమును చేతబట్టి – సుస్థిరంబగు సేవ చేయగ || యేసుప్రభు ||