#357మనోసాక్ష్యానందము
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: శహన (చేయ: సకలేంద్రియములారా)Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
ఇతరుల సాక్ష్యము – లెంతొ గలిగియున్న – మరి సాక్ష్యమే మందడి
మృతి బొంది లేచియున్న – త్త మోక్ష రాజ్యాధి – పతియై యున్న యేసు – ప్రభువే మా విభుడైన || నితరుల ||
1.
గురి సిలువ దెస మాకు – స్థిరమై నిలిచియున్న – దురితము తల యెత్తినే
మరి యేసు ప్రక్కలో – చొరబారి యందున్న – కరుణారసము గ్రోలు – టెరిగి యుండిన చాలు || నితరుల ||
2.
తలవాల్చుటకు తనకు – స్థలము లేదనునట్టి – పలుకే మా కైశ్వర్యము
బలమిచ్చి యెదిగించు – ప్రభు వాగ్దత్తములే – మా – కలిలో పంచభక్ష్య – ములుగా నుండిన చాలు || నితరుల ||
3.
బెదిరించి సైతాను – కదలింపలేనట్టి – కుదురైన విశ్వాసము
బొదలుచు మాలో నిం – పొదవుచుండిన చాలు – మదిలో నెమ్మది యిచ్చు – మా యేసు కృప గల్గ || నితరుల ||