FaithWalk
← Back to Library

#356క్రైస్తవ సాక్ష్యము

Author: మల్లెల దావీదుComposer/Ragam: హిందూస్తాని ముఖారిCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
సాక్ష్య మిచ్చెద – మన స్వామి యేసు దేవుండంచు సాక్ష్య మనగా గనిన వినిన – సంగతులను దెల్పుటయే సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు || సాక్ష్యమి ||
1.
దిక్కు దెసయు లేని నన్ను – దేవుడెంతొ కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినాడో || సాక్ష్యమి ||
2.
పల్లెటూళ్ళ జనుల రక్షణ – భారము నాపైని గలదు పిల్లలకును పెద్దలకును – ప్రేమతో నా స్వానుభవము || సాక్ష్యమి ||
3.
బోధ చేయలేను వాద – ములకు బోను నాక దేల నాధుడు యేసు ప్రభుని గూర్చి – నాకు దెలిసినంత వరకు || సాక్ష్యమి ||
4.
పాపులకును మిత్రుడంచు – ప్రాణ మొసగి లేచె నంచు భావముల క్షమించు నంచు – ప్రభుని విశ్వసించుడంచు || సాక్ష్యమి ||
5.
చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోరపాపులైన క్రీస్తు – కూర్మితో రక్షించు నంచు || సాక్ష్యమి ||
6.
పరమత దూషణము లేల – పరిహసించి పలుకుటెల ఇరుగు పొరుగు వారికెల్ల – యేసు క్రీస్తు దేవుండంచు || సాక్ష్యమి ||
7.
ఎల్లకాల మూర్ఖుడనై – నేల యాత్మ శాంతి లేక తల్లడిల్లు వారలకును – తండ్రి కుమార రాత్యాత్మ పేర || సాక్ష్యమి ||