#358క్రైస్తవ మను యుద్ధము
Author: జి. మునిస్వామిComposer/Ragam: సురటిCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
సిలువ సైనికులారా – నిలువండి వడి లేచి
బలుడు యేసు క్రీస్తు – ప్రభు దయ జయమౌను || సిలువ ||
1.
రారాజు పంపున – రణము సేయగ బూని
ధీరులై నిలువండి – దినము శత్రుల గెల్వ || సిలువ ||
2.
అతడు నిజ ధ్వజ – మత్యున్నతి నొంద
బ్రతుకు వీరుని గెల్చు – వరకు సేనల నడుపు || సిలువ ||
3.
మీ స్వీయ బలమున – మీ రానుకొనకయే
మీ స్వామి బలమును – మీరు నమ్మి గెల్వ || సిలువ ||
4.
శత సహస్రము లైన – శత్రుల నెదిరించి
సతతము ప్రభు సేవ – సల్పి ధైర్యము నొంది || సిలువ ||
5.
దేవుడొసగినట్టి – దివ్య కవచము దాల్చి
భావ ప్రార్థనాసి – బట్టి యుద్ధము సేయ || సిలువ ||
6.
జయశీలు రగువారు – చారు కిరీట మంది
జయశాలి క్రీస్తు దయ – జనెదరు సద్గతికి || సిలువ ||