FaithWalk
← Back to Library

#353క్రీస్తుని పోలియుందును

Author: సి. రవివర్మComposer/Ragam: బేహాగ్ (ఛాయ: ఇదిగో నీతి భాస్కరుండు)Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
నేను క్రీస్తు ప్రభుని జేరి – నేను క్రీస్తువాడ నౌదు నేను క్రీస్తు సొత్తుగాన – నేను నా సమస్తమును – నాధుడు యేసు కిపుడు రిత్తు || నేను ||
1.
నేను క్రీస్తు ననుభవించి – నేను క్రీస్తు పోలియుందు నేను నా స్వరూపమందు – నా ప్రభుండు గానుపింప – నేను నేసులో వసింతు || నేను ||
2.
నేను క్రీస్తు నందునుండి – నేను క్రీస్తులో బెరుగుదు నేను క్రీస్తు దారినడచి – నేను క్రీస్తు మనసు నెపుడు – గానుపరతు నెల్లెడను || నేను ||
3.
నేను క్రీస్తు సేవచేసి – నేను క్రీస్తు సాక్షినౌదు నేను క్రీస్తు సాధనంబే – నేను యనుభవించు రక్ష – ణానందంబు చాటెద నెపుడు || నేను ||
4.
నేను ప్రాణమైన నిచ్చి – నేను క్రీస్తుకై బ్రతుకుదు నేను, క్రీస్తు కలిసియున్న – నాశనమ తన యని శక్తి – నేలగాలు నద్భుతముగ || నేను ||