FaithWalk
← Back to Library

#352యేసు నా రక్షకుడు

Author: రావి జాన్ సుందరరావుComposer/Ragam: ముఖారిCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
వెలుగును రక్షణకర్తయు నగునా – బలమగు దేవుని స్తోత్రింతును వెరువను నేనిక నెవరికిన్ – వెలుగైన యేసే నా దుర్గము || వెలుగును ||
1.
అగాధ చీకటి జలముల నుండి – అఖండమైన వెలుగు సృజించిన యుగయుగంబుల నేలెడి ప్రభువు – అఘములను బాపి నన్ను వెలిగించును || వెలుగును ||
2.
నా దీపమును వెలిగించు ప్రభువే – నా దరి చీకటిన్ వెలుగుగ మార్చును నా దోషము లెల్లను దన కాంతిలో – నాదరముగా గడిగి రక్షించును || వెలుగును ||
3.
పలువిధ శోధనల్ నన్ను చుట్టినను – విలువగు సంపద లంతరించినను వెలుగు దాత నాపై యురులొడ్డెడి – నలయక నిత్యము నడిచెద వెలుగులో || వెలుగును ||
4.
తల్లిదండ్రులు విడిచినగాని – యులము విడి భయమందినను ఎల్ల ప్రజలు నన్ను ద్వేషించినను – ఎడబాయడు నా ప్రియుడగు యేసు || వెలుగును ||
5.
క్రీస్తు యేసుడే లోకపు వెలుగని – వాస్తవముగా గనుడి ప్రియులారా శాశ్వతంబగు రాజ్యము చేర – సత్వరమాయన వెలుగును బొందెదరు || వెలుగును ||