FaithWalk
← Back to Library

#351యేసే రక్షకుడు

Author: రావూరి లక్ష్మీనరసయ్యComposer/Ragam: సావేరిCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
నీ కన్న నిక వేరే – వేల్పులు లేరయ్యా – నిజముగా నా యేసువా నీ కరుణ యను నెనరుచేతను – నీదు సత్య సువార్త ద్వార – ప్రాకటంబుగా నన్ను పిలిచిన – లోక రక్షక నీకు మ్రొక్కెద || నీ కన్న ||
1.
నిన్ను తెలియక మున్ను – నన్య దైవంబుల – ననుసరించిన పాపము లన్ని పెనగొని నాదు హృదయపు – గన్ను గ్రమ్మి ప్రకాశ మియ్యక – యున్న నీ విమలాత్మ వరమున – నన్ను వెలిగించిన దయానిధి || నీ కన్న ||
2.
వదలక నే జేయు – తుద లేని పాపము – వదలించి నను బ్రోచితి తుది దినంబున గలుగు బాధలు దొలగ జేయుట నీవ యని నా హృదయమందున నా నిరీక్షణ – పదిలపరచిన భక్త పాలక || నీ కన్న ||
3.
నీ వాక్యార్థము నాలో – నివసింపజేసి నీ – సేవకునిగా బ్రోవవే నీవే సత్యము నీవే జీవము – నీవే మార్గము నీవే ద్వారము – నీవు గాకింక నెవరు లేరు - కావవే నన్ను యేసు నాయక || నీ కన్న ||