#350రక్షణ పొందిన పాపి
Author: UnknownComposer/Ragam: ఆనందభైరవి (ఛాయ: ఈలాటిదా యేసు ప్రేమ)Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
నా యేసు! నా యాత్మ బలమా! – నీదు గాయంబులే నిలువదగిన స్థలము
సకల సృష్టి పునాదియప్పుడే – నాదు సకల పాపములకై బలియైతి వేసు!
సకల భూమ్యాకాశములను – సమముగా గతించినగాని నీ ప్రేమ నిలుచు || నా ||
1.
నా తండ్రి! నీ నిత్య కృపను – నెంచ నా తరమా? నీ ప్రేమ హస్తములు ఈచి
పాతకులం రండంచు బిలిచి – వేగ నీదు కృప రుచి జూపి జీవంబు నిచ్చు || నా ||
2.
దరిలేని లోతైన ప్రేమా! – నీలో – దురిత మెల్లను మునిగి పోవు
దరిలేని యుచిత కృప చాటు – నీదు – రక్తంబు నా పాపదాగులను గడిగె || నా ||
3.
ఈ ప్రేమ సాగరంబున నే – దుమికి – నా ప్రభుని యెదదూరి విశ్రాంతి నొంది
ఏప్రొద్దు సంతసింతును – నన్ను – నా ప్రాణమును డాయదిక నరక మొందు || నా ||
4.
నా శిరముపై నలలెరిగి – యిలను – నా సత్తువయు స్నేహితులు నన్ను వీడి
నా సుఖము నా సంతసమును – బోయి – నన్ను నీదు కృప నన్ను విడిపోదు తండ్రి || నా ||
5.
నా హృదయమే నిలిచిపోనీ – నాదు శరీరమే కుళ్ళి నీరైన గానీ
ధర పునాదులే కరిగిపోనీ – యేసు – నిరంతరము నీ ప్రేమ నిలుచు నన్ను బ్రోచు || నా ||