FaithWalk
← Back to Library

#349రక్షణానందము

Author: యు.ఎ. భాసిలామణిComposer/Ragam: కల్యాణి (చేయ: ఎంతో సుందరమైనవి)Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
సంతోషింపరే ప్రియులారా – యేసుని చెంత సంతసింపరే మనసార – ఎంతో ప్రేమించి యనంతడుసగెను సుతుని వింతగ బ్రతుకవ సంత శోభను దాల్చే – అంతరంగములో వసించిన చింత లెల్లను వాడబారెను – గంతులిడుచును నూత్నజీవ పూవుల – తాంతములు పూయందొడగెను || సంతో ||
1.
సిలువలో వలారిన – యేసునిప్రేమ – ఫలియించె హృది వనమున కలుష మెల్లను బాపు – కల్వరిలో భక్తి – పలవులు చిగురించి చెలుని పాద పద్మములు – అలుముకొని యారాధనంబున – మలయమారుత గలికల పై మలపు గొనుచు సమర్పణంబును – సులలితముగా జేయ దొడగెను || సంతో ||
2.
పాపతాపము తొలగెను – జీవితపు తుఫానులన్నియు నణగెను ప్రాచీన సర్పము – పగబట్టి పడగెత్తి – పంతమున నన్నుడాసి – పట్టువున కూలవంగ పాప మరణపు విరుగుడగునా – ప్రభుని యమృత రక్తసారము – ప్రాణ భిక్షను బెట్టెను మరి – పగతుని యోడించెను హాహా || సంతో ||
3.
యాత్రాపదమున యేసుడు – ప్రకాశింప రాత్రియే పగలాయెను నేత్రములు వికసింప – ధాత్రి నా బసలోప – విచిత్ర వాక్యములో విచిత్ర కృపలను గాంచి గాత్ర వీణను మీటి దేవుని – స్తోత్ర గీతము పాడి పుణ్య – క్షేత్ర పధమున బోవ యేసుడు – మిత్రుడై నడిపింప దొడగెను || సంతో ||
4.
సరిసంపదలు యున్నను – లేకున్నను – కరుణావరములు తరుగవు పైరు పంటలు గాని – పరువు ప్రతిష్టలు – కరుణ వంతవు నైన గాని నే – మురియుదు మదిలోన – గిరులపై నరుగులిడుటకు హరిణ పాదము లొసగె యేసుడు వెరతునా చింతింతునా కలువరిని ప్రేమలు కురియుచుండగ || సంతో ||