FaithWalk
← Back to Library

#348క్రీస్తునందలి నా యానందము

Author: మూంగమూరి దేవదాసుComposer/Ragam: కల్యాణి (ఛాయ: దారుణమగు మరణ)Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
నా కింత ప్రోత్సాహ – నందంబుల్ గలుగుట కే కర్త ఘనమైన – హేతువై యుండు నాకు గల యున్నత – కృతత్వమే నాధుడు నగును నేను మురియు – నాకరంబగు నామ మేది సిలువబడ్డ యేసు క్రీస్తే || నా కింత ||
1.
ఎవరు నా భక్తికి – హితమైనట్టి పునాది యెవరు నా కంఠంబు – నెత్తెన్ పాటలతో ఎవరు నా పాపముల – భారము నెత్తుకొని దేవునికి నాకును – చివరకున్ స్నేహంబు కలిపిరి – సిలువబడ్డ యేసు క్రీస్తే || నా కింత ||
2.
నేను నా విధులెల్ల – నిశ్చయంబుగ నెరుగ – జ్ఞాన మిచ్చుచునుండు జ్ఞాని యెవ్వారు – వాని యెడల నన్ను యధార్థ – పరునిగా గావించి యవినా – చే నెరవేర్పించు నెవరు – సిలువబడ్డ యేసు క్రీస్తే || నా కింత ||
3.
ఎవరు నా శత్రువు – నెదిరించి గెల్చిరి – యెవరు నా శోకంబు – నెగరు గొట్టిరి ఎవరు నా హృదయంపు మూర్ఛను – నీడ్చి సేదను దీర్చి మనసు – చివుకుమను గాయంబు మానిపిరి – సిలువబడ్డ యేసు క్రీస్తే || నా కింత ||
4.
మరణంబులో నాకు – స్థిరజీవ మెవ్వారు – మరణంబునకె గొప్ప మరణ మెవ్వారు – విరివిలేని మహిమ సేలు – దరిని నుండగ నన్నున్ జేతను స్థిరముగ స్థాపించు నెవరు – సిలువబడ్డ యేసుక్రీస్తే || నా కింత ||
5.
నన్ను రక్షింప మరణం బొందియు సమాధి – నేన్నటికిని గెల్చి – యున్న ప్రభునందు – నున్న విశ్వాసంబే నాకు – నుత్తమంబును గలుగజేయును – చెన్నగు నా ప్రభువు కింక నెవ్వరు – సిలువ బడ్డ యేసు క్రీస్తే || నా కింత ||