FaithWalk
← Back to Library

#347నిత్యజీవానందము

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: సురటిCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
ఆనందమగు ముక్తి – యే నా మందిరము జాని మానగ నచ్చు – దాని సుందరము || ఆనందమగు ||
1.
పరదేశి వలె దేహ – వరణమందుందున్ ధరణి కాననముగా – దర్శించుచుందున్ నెరిదుఃఖ సుఖములు – సరిగా భావింతున్ పరిశుద్ధాత్మని వేడి – పరితృప్తి నొందు || నానందమగు ||
2.
బహు శోధనలు నాపై – బడి వచ్చునప్పుడు నహితాంధతమమునన్ – నల్లుకొనినప్పుడు నిహ బాధలన్నిన – నెదిరించినప్పుడు నహహా యేసునివల్ల – నమృతుడ నెప్పుడు || నానందమగు ||
3.
ముందు నా మనసు దేవుని కప్పగింతు నందరి నస్మత్తుల్యముగా ప్రేమించుతున్ సందేహ రాహిత్య సరణిలో నిలుతున్ పొంద బోయెడి ముక్తి భువి యందె గాంతు || నానందమగు ||