FaithWalk
← Back to Library

#345Oh happy day that fixed my choice

Author: ఫిలిప్ డాడ్రిడ్జ్Composer/Ragam: అనువాదం: బర్నార్డ్ లూకాస్Translator: బర్నార్డ్ లూకాస్Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
హా! యానంద సుదినము నా యేసునన్ నమ్ము దినము ప్రయాస మెల్ల బోయిన దయారక్షణ దినము.
1.
|| భాగ్యమౌ దినము ప్రభునన్ గైకొన్న దినము భక్తి ప్రార్థన లేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దినము ప్రభునన్ గైకొన్న దినము ||
2.
ప్రభునితో నిరంతరమౌ నిబంధన చేసికొంటి నే బుట్టి నింపొందగ విభుని పాదపద్మము.
3.
& 5. నా యాత్మ, శాంత మొందుము నీ యేసే నీ యాధారము భయంబు లేక రక్షణన్ పాలిభాగంబు పొందుము. నే నేసువాడ నేసుడు నిత్యంబు నా వాడాయెను ఇదేంత గొప్ప భాగ్యము నేనేసు యొక్క మిత్రుడన్ నే జేసితి ఒప్పందము ఎల్లెడ నెరవేర్తును నే జచ్చు వేళయందును నీ దయ మెచ్చి పాడుదున్.