FaithWalk
← Back to Library

#344నూతన జన్మము

Author: తూపిలి రంగయ్యComposer/Ragam: శంకరాభరణముCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
పరమ రాజ్యమునకు నరులు – తిరిగి పుట్టవలయు ననుచున్ వరము గురువు యేసు క్రీస్తు – స్థిరము చేసెను || పరమ ||
1.
వేదశాస్త్ర మెరిగినట్టి – యూదుల యధికారియౌ ని కోదే మనెడు పరిసయ్యుండు – మదిని దలచుచున్ || పరమ ||
2.
అతడు రాత్రివేళ ప్రభుని – వెదకి పోయి యెదుట స మ్మతిని నిలిచి పిలిచి పల్కె – హితువుతోడను || పరమ ||
3.
బోధకుండ నీవు మోక్ష – నాధుడౌ యెహోవ యొక్క వేద వార్త జెప్పెదవు నీ – బోధ నెరుగుదున్ || పరమ ||
4.
మరియు నీవు చేయుచున్న – గురుతు లెవ్వరైన దైవ వరము లేని యట్టి పాప – నరులు చేయరు || పరమ ||
5.
అనుచున్ పరిసయ్యుండు పల్క – వినుచు యేసు కనికరమునన్ దనకు నిట్లు దెలిపెన్ జాలి – మనసుతోడను || పరమ ||
6.
క్రొత్త జన్మ మెవ్వడైన – నెత్త కున్న మోక్షమునకు నెత్తబడడటంచు నిజము – క్రీస్తు పల్కెను || పరమ ||
7.
వినుచున్ పరిసయ్యుండు ముసలి – జనుడు మరల తల్లి గర్భ మునను తిరిగి యెట్లు బుట్టు – ననుచున్ బల్కెను || పరమ ||
8.
అందుకేసు దెల్పె జలము – నందు నాత్మయందు జన్మ మొంద కున్న మోక్ష రాజ్య – మొంద రనుచును || పరమ ||