#346Blessed assurance - Jesus is Mine
Author: ఫ్రాన్సెస్ జేన్ వాన్ ఆల్‌స్టీన్Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
యేసు నావాడని నమ్ముదున్
భాసిల్లు దివ్య సౌభాగ్యము
దాసుడనౌచు పాలొందెదన్
నాశంబు లేని సౌఖ్యంబును.
1.
|| ఇదే నా పాట నా సుకథ
యేసుని సదా స్తుతించుట
ఇదే నా పాట నా సుకథ
యేసుని నిత్యం ధ్యానించుట ||
2.
సంపూర్ణ భక్తితో నుండెదన్
పెంపార యేసున్ ధ్యానించెదన్
సొంపైన దూతలు పాడుచుండన్
ఇంపైన పాటల్ నే విందును.
నిండెన భక్తియే నెమ్మది
గెల్చున దేమి యేసుండగ
మెండైన దీప్తిన్ ప్రార్థించుచు
దం డిగ ప్రేమను సుఖింతును.