FaithWalk
← Back to Library

#33Before Jehovah's Throne

Author: ఐజాక్ వాట్స్ (అను: డి. న్యూవెల్)Category: దైవారాధన — దైవస్తుతి
1.
యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రొక్కండి యెహోవా దేవుడు సుమీ సృజింప జంప కర్తయె.
2.
స్వశక్తిచేత నాయనే మమ్మున్ సృజించె మంటిచే భ్రమించు గొర్రె రీతిగా దప్పంగ మళ్ళీ చేర్చెను.
3.
సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి గన్న జగత్తు వేరు నోళ్లతో స్తుతించు దివ్యమౌ ధ్వనితో.
4.
ప్రభుత్త్వముండు నంతకు నీ ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు నెల్లకాలము.