FaithWalk
← Back to Library

#34Come, Thou Almighty King

Author: చార్లెస్ వెస్లీ (అను: ఒంగోలు దావీదు)Category: దైవారాధన — దైవస్తుతి
1.
సర్వేశా! రమ్ము నీ సన్నిధి కాంతి నొసంగు మాకు సత్య సనాతన సర్వాధికారుడా సదా మమ్మెలుము సర్వోన్నతా!
2.
నిత్యంపు వాక్యమా! నీదగు ఖడ్గము నిమ్ము మాకు నీ నిజ భక్తులను నీ వాక్య ప్రియులను నింపు నీ యాత్మతో నింపుమీరా.
3.
రమ్ము మహాత్మా! మా కమ్ము నీ యాత్మను రమ్ము వేగ రక్తితో నిప్పుడు రమ్ము మా మధ్యకు రక్షించు మమ్మును రంజిల్లగా.
4.
స్తోత్రం పవిత్రుడా! స్తోత్రంబు త్రేకుండా! స్తోత్రం సదా ధాత్రి నీమహిమ నేత్రంబులు గనమీ, "త్రాహిమాం" యని వేడువారికి.