FaithWalk
← Back to Library

#32అర్పణ కీర్తన (దావీదు కీర్తన 51:16-19)

Author: మల్లెల దావీదుComposer/Ragam: హిందూస్థానీ తోడి (ఛాయ: ఆహా ఎంతటి శ్రమలు)Category: దైవారాధన — దైవస్తుతి
ప
దహనబలి నీకు నష్టము మరియు దైవబలులు విరిగిన యాత్మయే యెహోవా దేవ విరిగినలిగిన యట్టి హృదయము లక్ష్యంబు సేయుదువు ॥దహనబలి॥
1.
నీ కటాక్షముతో సీయోనును నిప్పుడే నెనరుతోడను మేలు చేయుమి ప్రాకటంబుగాను యెరూషలేమునకు బ్రాకారములను గట్టించుమి ॥దహనబలి॥
2.
అంతట నీతియుక్తంబులౌ బలుల యాగముల సర్వాంగహోమముల్ ఎంతో ఇష్టమౌ బలిపీఠము మీద నెన్నో కోడెలు జనులర్పింతురు ॥దహనబలి॥