#31ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము
Author: మల్లెల దావీదుComposer/Ragam: శంకరాభరణముCategory: దైవారాధన — దైవస్తుతి
1.
ఓ ప్రభుండా నిన్ నుతించుచున్నాము వినయముతోడ
మా ప్రభుండవంచు నిన్ను మానకమే మొప్పుకొందుము ॥ఓ ప్రభుండా॥
2.
నిత్యుండౌ తండ్రి లోకము నిన్నారాధించుచునుండు
సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్ ॥ఓ ప్రభుండా॥
3.
నిత్యమేక కంఠరవముతోడ నిన్ గొనియాడుచున్నారు
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ సేనల దేవా
ధరణి పరలోకంబులు నీ వర మహిమతో నొప్పునంటంచు ॥ఓ ప్రభుండా॥
4.
కెరూబుల్ సెరాపుల్ నిన్ను గీర్తించుచున్నారు
సారెకు నిన్ అపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు
కూరిమి ప్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ॥ఓ ప్రభుండా॥
5.
మా మహా జనకా నిన్ను మాన్యుడౌ పుత్రుని
బహు ప్రేమగల ఆదరణకర్తయైనట్టి శుద్ధాత్మని
నంతటనుండు సభ యొప్పుకొనును నిన్ ప్రభు ॥ఓ ప్రభుండా॥
6.
నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుడవు
నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము
పావనంబౌ నీ రక్తమున సేవకులకు దోడ్పడుమిప్పుడు ॥ఓ ప్రభుండా॥
7.
నిత్య మహిమములో నిక నీదు భక్తులతో
సత్యముగా లెక్కింపుము వారల గని రక్షింపుమి నీ సుజనంబును ॥ఓ ప్రభుండా॥
8.
నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి
వారల బాలించి లేవనెత్తుము సతతము ప్రీతిన్ ॥ఓ ప్రభుండా॥
9.
ఓ ప్రభువా పాపములో నుండకుండగ దోడ్పడుము
మా ప్రభువా కరుణించు మము గరుణించుము దయతోడన్ ॥ఓ ప్రభుండా॥
10.
ఓ प्रभुండా నిన్ను నమ్మియున్న మాకు బ్రేము జూపు
శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొందనీయకుము ॥ఓ ప్రభుండా॥