FaithWalk
← Back to Library

#312The Great Physician

Author: UnknownCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
మహా వైద్యుడు వచ్చెను ప్రజాళిని బ్రోచు యేసు సహాయ మియ్య వచ్చెను సంధింపరండి యేసుకన్.
1.
॥మాధుర్యంపు నామము – మోదమిచ్చు గానము వేద వాక్య సారము యేసు దివ్య యేసు॥
2.
మీ పాపమెల్ల బోయెను మేలొందుడి యేసు పేరన్ కృపా సంపూర్ణ మొందుడి. వినుండు గొర్రెపిల్లను విశ్వాసముంచి యేసుకన్ ఘనంబుగాను స్తుతించుడి మనంబుప్పొంగ యేసుకన్. ఆ రమ్యమైన నామము అణచునెల్ల భీతిని శరణ్యులైన వారి నా ధరించు నెంతో ప్రీతిన్. ఓ యన్నలారా పాడుడి యౌదార్యత్వమున సర్వేశున్ ఓ యమ్మలారా మ్రొక్కండి ప్రియాతి ప్రియుడేసుని. ఓ పిల్లలారా కొలువుడి యున్నత్య రాజు నేను సవరించు వారి దాతయై దయామయుండు శ్రీ యేసు శ్రీ యేసుకై అర్పించుడి మీ యావజ్జీవమును ప్రియంపు దాసులౌచును రయంబు గొలువుడేసుకన్. — విలియం హంటర్ (అను: ఆల్‌ఫ్రెడ్ త్యాగరాజు పామర్)