FaithWalk
← Back to Library

#306సువార్త

Author: ఎస్. జె. మోజెస్Composer/Ragam: అహిరి (ఛాయ: యేసువంటి ప్రియబంధువు)Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
పాపినైతినని – ప్రభు పదములకడ – ప్రార్థన సేయుము ఓ మనసా – పాపుల మిత్రుడు – प्रभु యేసునికడ – పాపక్షమాపణ గలదో మనసా ॥పాపినైతి॥
1.
నరుని స్వనీతిచే – దొరకదు మోక్షము – నరులను జూడకు యా మనసా – ధర నొక పుణ్యుడు – దరచిన లేడని – పరమ వేదములో గలదో మనసా ॥పాపినైతి॥
2.
జప తపములు మరి – యుపవాసములును – ఉపయోగపడవు ఓ మనసా – నెపముల జెప్పెడు – అపవాదిని విడి – కృపవాదినిగా బ్రతుకవ మనసా ॥పాపినైతి॥
3.
మానని ప్రేమచే – మనుజుల బ్రోవగ – మానవుడయ్యెను ఓ మనసా – మానుగ గల్వరి – మ్రానుపై యేసుడు – ప్రాణము నొసగెను ఓ మనసా ॥పాపినైతి॥
4.
మరణము నొందియు – మరల సజీవుడై – మనుజుల కగపడెనో మనసా – మరణ బంధముల – పరిమార్చిన ప్రభు – సరి రక్షకులిక లేరల మనసా ॥పాపినైతి॥
5.
మారుపును బొందక – మలిన తరుణము – మరల లభింపదు ఓ మనసా – తీర్పు కాలమున తీర్పరి క్రీస్తుని – స్థిరముగ నమ్ముము యేసుని మనసా ॥పాపినైతి॥