FaithWalk
← Back to Library

#305రక్షకుని యొద్దకు రండి

Author: జి. జాన్ తాతయ్యComposer/Ragam: మారూవCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
రండి మానవులారా – రక్షకుని న – మ్మండీ వేగము ప్రియులారా – రండి పాపుల బ్రోచుటకు పర – మండలంబిను విడిచి యీ భూ భూ – మండలంబున కరుగుదెంచిన – మహాత్మున గనుగొని సుఖింపను ॥రండి॥
1.
ఇలలో మానవులందరు – పలువిధ పాప – శలలో మునిగి యుండిరి – తులువయగు సాతాను చెడ్డ – వలన చిక్కినవారలను దన – బలముతో విడి పింప ప్రాణము – బలిగబెట్టిన प्रभुని యొద్దకు ॥రండి॥
2.
పరముండు నరులందరికై – మరణంబియెయ్యె – కరుణతోడను కొరతపై – మరలి మూడవ దినమునందున – మహిమతో నా प्रभुవు లేచె – తెరవ జేసెను మోక్షమార్గము – శరణు జొచ్చినవారలకును ॥రండి॥
3.
పాపభారంబు నుండి – విడుదల నొంద – ప్రాపుగోరినవారలు – ప్రాపకుండగు క్రీస్తు నాథుని – దాపు జేరి తపంబు చేసిన – పాపభారము తీసి శాంతిని గూర్చు – యా ప్రభు నొద్ద కిప్పుడే ॥రండి॥
4.
భవమందున దెలియుడి – మీరు నిత్య – జీవమార్గము గనుడి – పావనుండగు క్రీస్తు మిమ్మును – పావనులుగా జేసి నూతన – జీవము నొసంగి పరమున – చేర్చు మిమ్మును నిశ్చయముగా ॥రండి॥