#307యేసు క్రీస్తు సమాధానకర్త
Author: ఎ. బి. మాసిలామణిCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు – హే ప్రభు దేవసుతా – సిలువధరా, పాపహరా, శాంతికరా ॥హే ప్రభు॥
1.
శాంతి సమాధానాధిపతీ – స్వాంతమునందు ప్రశాంత నిధీ – శాంతి స్వరూపా, జీవనదీపా – శాంతి సువార్తానిధీ ॥సిలువధరా॥
2.
తపములు తరిచిన నిన్నే గదా – జపములు గొలిచిన నిన్నే గదా – విఫలములు చేసిన విజ్ఞాపనలకు – సఫలత నీవే గదా ॥సిలువధరా॥
3.
మతములు వెదకిన నిన్నే గదా – వ్రతములు గోరిన నిన్నే గదా – పతితులు దేవుని సుతులని నేర్పిన – హితమతి వీవే గదా ॥సిలువధరా॥
4.
పలుకులలో నీ శాంతి కథ – తొలకరి వానగా గురిసె గదా – మలమల మాడిన మానవహృదయము – కలకలాడె గదా ॥సిలువధరా॥
5.
కనునతుల్య సమాజములో – హీనత జెందెను మానవత – మానవ మైత్రిని సిలువ పతాకము – దానము చేసె గదా ॥సిలువధరా॥
6.
దేవుని బాసిన లోకములో – చావూయె కాపురముండె గదా – దేవునితో సఖ్యంబును జగతికి – రీవి నిడితివి గదా ॥సిలువధరా॥
7.
పాపము చేసిన స్త్రీని గని – పాపుల కోపము మండె గదా – దాపున జేరి పాపిని బ్రోచిన – కాపరి వీవే గదా ॥సిలువధరా॥
8.
ఖాళీ సమాధిలో మరణమును – మితైగ జేసిన నీవే గదా – ఖలమయుడగు సాతానుని గర్వము – ఖండనమాయె గదా ॥సిలువధరా॥
9.
కల్వరిలో నీ శాంతి సుధా – సెలయేరుగా బ్రవహించె గదా – కలుష మెడారిలో కలువలు పూయుట – సిలువ విజయము గదా ॥సిలువధరా॥