#290తప్పిపోయిన వారిని మేలుకొలుపుట
Author: దావీదు చౌదరిComposer/Ragam: ఆనందభైరవిCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
ఎందుకు మరిచితివి – యేసుని ప్రేమ – ఎందుకు మరిచితివి – ఎందుకు మరిచితివి – పొందితివి నిందలు – సుందరమగునట్టి – సుఖమైన ప్రభు ప్రేమ ॥నెందుకు॥
1.
దేవ గ్రంథము నీవు – చదవలేదా – భావమున దాని గైకొనలేదా – సేవక వృత్తులు – సేయక పోతివి – చావరాని చావు – సంపాదించితి వయ్యో ॥ఎందుకు॥
2.
చిందిన రక్తము – సిలువపైని – పొందెను కష్టము – మేకుల పోట్లు – నెందరెందరు కల్వరి – మెట్టుపై నతని – నిందించి చంపిరి – నిర్దయులై యకటా ॥ఎందుకు॥
3.
పాపేచ్ఛలోనుండి – మరలి వాని – శ్రీ పాదములు పట్టుము ప్రార్థించుము – కాపాడుటకు దయతో – కనిపెట్టి యున్నాడు – పాపి నీ విభుడైన – ప్రభు మార్గమున బొమ్ము ॥ఎందుకు॥