FaithWalk
← Back to Library

#291శాశ్వత ధనము

Author: పులిపాక జగన్నాథముComposer/Ragam: నాటCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
ధరణిలోని ధనము లెల్ల – ధరణిపాలై పోవును – గరిమతోడ నీవు గైకొను – నిరతముండెడి ధనమును ॥ధరణి॥
1.
యేసునందు నిత్యజీవం – బిప్పుడు దేవు డిచ్చును – తీసుకొనుము దాన్ని వేగము – దివ్య వరముగ నమ్మికను ॥ధరణి॥
2.
విడువు నీదు పాపములను – తడవు చేయ బోకుమీ – విడువకున్న నీకు గలుగు – వేదనధికంబుగా ॥ధరణి॥
3.
పరుల మాటల బట్టి నీవు – పడకు మోసమందున – నరుల కొరకు జీవమిచ్చిన – పరమధాముని నమ్ముమీ ॥ధరణి॥
4.
తలచుకొనుమి ధరణిలోన – నిలుచు కాలమంతటా – విలువలేని యేసు ప్రేమ – విధము చక్కగా నెరుగుచు ॥ధరణి॥
5.
దేవ కృపను బోలునట్టి – దివ్య భాగ్యమొక్కటియు – నీవు చూడబోవు మిత్ర – నేట నెచట వెదకినన్ ॥ధరణి॥