#289క్రీస్తు పాపుల గతి
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: మధ్యమావతిCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
ఇంక నేమి గతి యున్నది – మానవులారా – యింక నేమి గతి యున్నది – పాపులకోసం – మింక నేమి గతి యున్నది ॥
యొక్కడైన పుణ్యాత్ముండు – ఇల లేడని ముందే – ప్రకటించి దావీదు – పల్కె వేదము నందు ॥ఇంక॥
1.
ఇల రక్షకుండు లేమిని – గొర్రెల మంద – లీల జెల్లా చెదరాయెను – పులుల బోలిన దైవ – ములు గురువులు పెక్కు – గలరే ల వారు పద్ధతి చూప జాలరు ॥ఇంక॥
2.
దురితము నణగింపగ – పాపుల నెల్ల – దరి జేర్చి బ్రతికంపగ – పరమేశ్వరుడు తన – వరపుత్రుడగు క్రీస్తును – ధర కంపెన యేసు – శరణు జొరకయున్న ॥ఇంక॥