#29ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము
Author: బన్యన్ జోసెఫ్Composer/Ragam: దీరశంకరాభరణముCategory: దైవారాధన — దైవస్తుతి
ప
పాహి లోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని
వేడెదము మాం పాహి లోక ప్రభో ॥పాహి॥
1.
నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుడవు అని
చెన్నుమీరగా నమ్మి యున్నాము సత్ప్రభు ॥పాహి॥
2.
నిత్య మా తండ్రి భూ లోకం బంతయు నిన్ను
భక్తితో నారాధించుచున్నది మా ప్రభో ॥పాహి॥
3.
దేవ లోకాధిపతులు దూతల సమూహము
దేవా యని కొల్చుచున్నారు నిన్ను ప్రభు ॥పాహి॥
4.
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
పరలోక సేనాధిపతివైన మా ప్రభో ॥పాహి॥
5.
ఇహ లోకం బంతయు పరలోకం బంతయు నీ
మహిమ మహాత్మ్యముతో నున్నవి ప్రభో ॥పాహి॥
6.
కెరూబులను దూతలు సెరాపులను దూతలు
స్థిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో ॥పాహి॥
7.
నీ దైవభక్తుల మహిమగల సంఘము
ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో ॥పాహి॥
8.
నిత్యము ప్రవక్తల యుత్తమ సంఘము
సత్యముగా నిన్నుతించుచున్నది మా ప్రభో ॥పాహి॥
9.
ధీర హతసాక్షుల వీర సైన్య మంతయు
సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో ॥పాహి॥
10.
నిత్య మహాత్మ్యముగల తండ్రివైన నిన్నును
నీదు పూజ్యుడగు నిజ అద్వితీయ సుతునికన్ ॥పాహి॥
11.
ఆదరణకర్తయై నట్టి శుద్ధాత్మను
నంతటనుండు సభ యొప్పుకొనును నిన్ ప్రభు ॥పాహి॥