FaithWalk
← Back to Library

#28దేవుని మహిమ

Author: బేతాళ జాన్Composer/Ragam: ఆనందభైరవిCategory: దైవారాధన — దైవస్తుతి
ప
మహిమ సర్వోన్నతమైన దైవమునకు మహి సమాధానానుగ్రహము గల యోగ్యప్రభు ॥మహిమ॥
1.
నిన్ను స్తోత్రించుచు నిన్ను పూజించుచు నిన్ను మహిమ పరచుచున్నాము లోక ప్రభు ॥మహిమ॥
2.
ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి పరిశుద్ధంబగు ప్రభో ॥మహిమ॥
3.
వినయంబుతో నీదు ఘన మహిమార్థమై వందనము లర్పించి వినుతింతుము సత్ప్రభు ॥మహిమ॥
4.
జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల జనకుని కుమారుడ ప్రభు ॥మహిమ॥
5.
ధరణి పాపముల మోయు వరపుణ్య శీలుండా కరుణించి మా మీద మొరలాలించుము ప్రభో ॥మహిమ॥
6.
తండ్రియైన దేవుని దక్షిణ భాగమున గూ ర్చుండి యున్నావు కృప చూపుము సత్ప్రభు ॥మహిమ॥
7.
పరిశుద్ధుడవు నీవే పరమ ప్రభుడవు నీవే దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో ॥మహిమ॥
8.
పరమ జనకుని మహిమన్ పరిశుద్ధాత్మైక్యంబై సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో ॥మహిమ॥