#27దైవ స్తుతి
Author: వీరుప్పల మోషేComposer/Ragam: బిలహరిCategory: దైవారాధన — దైవస్తుతి
ప
కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక కలుగును
నత్యున్నతమైన ఘన స్థలములందున నిలకు సమాధానం
నరుల కాయన దయ ॥కలుగును గాక॥
1.
ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా
పరిపూర్ణ శక్తిగల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు
మరి పొగుడుచున్నాము ॥కలుగును గాక॥
2.
మహిమ పరచుచు నారాధించుచున్నాము నిన్ను
మహిమాతిశయమును మది దలంచియు నీకు మహిని
మా స్తుతి कृतజ్ఞత ఇచ్చుచున్నాము ॥కలుగును గాక॥
3.
ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా
లోక పాపము మోయు ఏక దేవుని గొర్రెపిల్ల
మమ్మును కనికరింపుము చల్లగా ॥కలుగును గాక॥
4.
లోక పాపములు మోయుచు బోవు యేసు రక్షకా
వాసిగ జనకుని కుడివైపున గూర్చుండి యేసూ
మా ప్రార్థన లాలించి కనికరింపుము ॥కలుగును గాక॥
5.
పరిశుద్ధుడవు ప్రభుడవు నీవో ప్రభువైన క్రీస్తూ
పరిశుద్ధాత్మతో తండ్రియైన దేవుని యందు
పరిపూర్ణ మహిమతో బ్రాలుచున్న మా ఆమేన్ ॥కలుగును గాక॥