FaithWalk
← Back to Library

#287Jesus shall reign where'er the sun

Author: ఐజాక్ వాట్స్ (అను: జాన్ స్మిత్ వార్ధా)Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
శ్రీ యేసు రాజ్య ముండును సూర్యుండు వెలుగు చోటెల్లా కల్పాంతకాల మౌదాక ఆ రాజ్యము వ్యాపించును. నిరంతరంబు ప్రార్థనల్ నిత్య స్తుతులు శ్రీ యేసునకు దన నామము ప్రత్యహము సుగంధము మటు లేచును. సమస్త దేశ వాసులు గణింతు రేసు ప్రేమను శ్రీ యేసు పేరు బాలకులు బాల్యంబున నుతింతురు. యేసుని యీవు లొల్కును ఖైదికి సంకెళ్ళు ఊడును డాయంగ శాంతి కలుగు సుభాగ్యమబ్బు పేదకున్. శ్రీ యేసు శక్తి చేతను స్వస్థంబు గలుగు నెల్లెడన్ దచ్చహత్తి యున్న మేరలన్ నశించు మృత్యు శాపముల్. మా రాజు కెల్ల సృష్టియున్ విశేష స్తుతులు సల్పుతన్ దూతాళి మరలి పాడగా భూరి ఘోషించు భూమియు ఆమేన్.