FaithWalk
← Back to Library

#265Glorious Things of Thee are Spoken

Author: జాన్ న్యూటన్ (అను: పి. సి. బెన్నో)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
దేవుని సీయోను పురమా! శ్రేష్ఠమౌ పట్టణమా! స్థావరంబైన పురమా! దేవుని నివాసమా! యుగముల శిలయైన దేవుడే నీ పునాది! శత్రువు జయించలేని రక్షణ నీ దుర్గము. కాంచుమా సజీవధారల్ శాశ్వత ప్రేమధారల్ నీదు పుత్రికా పుత్రులన్ తృప్తిపరచు ధారలన్ అలసి సొలయకుండా దాహమున్ దీర్చుధార దాతయౌ దేవుని కృప సర్వకాలంబు పారున్. కాంచుమా నీ యిండ్లమీద అగ్ని మేఘంబులిద్దె ప్రభుని రాక సమయం బని మహిమ దెల్పే! ప్రార్థన ఫలంబిచ్చి మన్నా నిచ్చిన ప్రభు సింహాసనాసీనుడై సునాదుస్తోత్రంబుల్ వినెదన్.