#266నిజసేవకుని లక్షణములు
Author: మల్లెల దావీదుComposer/Ragam: ధీరశంకరాభరణము (ఛాయ: భజన చేయుచు)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ఘన యెహోవా నీ గుడార – మున నుతియింప నెవ్వాడు – పరమ నీ పరిశుద్ధ పర్వత – మున వసించెడువాడెవ్వాడు ॥ఘన॥
1.
వెలయగను యథార్థ వర్తన – గలిగి నీతి ననుసరించుచు – నెలమితో మనసార నిజము – పలుకుచుండు వాడై సుమ్మ ॥ఘన॥
2.
తనదు నాలుకతో గొండె మాడడు – తన సఖునకును కీడు చేయడు – తనదు పొరుగు వానిపై నిందలను మోపించడు హేనియు ॥ఘన॥
3.
వానికిని నీచుండసహ్యుడు – వాడు భక్తుల గౌరవించును – హాని గలిగిన నా తడును బ్ర – మాణ మాడియు మాట తప్పడు ॥ఘన॥
4.
మరియు ద్రవ్యము – వడ్డీ కీయడు – నిరపరాధిని జెరప లంచము – అరయడు అట్టిటుల చేయువాడే – ధర నెప్పుడు గదలబడడు ॥ఘన॥
5.
జనక తనయ పావనాత్మకు – ఘన మహిమయు గలుగుగాక – మును పిప్పుడు నెలప్పడును యుగ – ములకును గలుగుగాక యామేన్ ॥ఘన॥