#263క్రీస్తు సంఘమునకు శిరస్సు
Author: చెట్టి భానుమూర్తిComposer/Ragam: బేహాగ్Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
సంఘ శిరసై వెలయు ప్రభువా – సత్యకృప సంపూర్ణ ప్రభావా – సర్వ క్రైస్తవ సంఘ మహి మా – స్తోత్రగీతముల్ స్వీకరింపుమా ॥సంఘ॥
1.
సంఘ యస్థిభారము గీవే – సంఘ జీవాధారము నీవే – సర్వ జనరక్షణము నీవే – సర్వలోక నిరీక్షణ నీవే ॥సంఘ॥
2.
తరణి చుట్టు తారాగ్రహములు – పరివృతంబై తిరుగు రీతిని – తల యె క్రీస్తై తనువే భక్తులై – తగిన సఖ్యత నైక్యత నందురు ॥సంఘ॥
3.
నూతనాత్మ నూతన జన్మ – నీతి సేవా నిరతియు గలిగి – నిత్యమతని యందు నిలిచి – నెగడు వారే నిజక్రైస్తవులు ॥సంఘ॥
4.
ఆత్మశుద్ధి – అనుపమబుద్ధి అమలవర్తన మనిశము గలిగి – ఆత్మఫలములు జ్ఞాపక నేర్చిన – యను భవంబే క్రైస్తవంబు ॥సంఘ॥
5.
విశ్వసింతుము నిన్నే మేము – విమల జీవ ప్రదాయకుండ – వరుడ నీవై వరదుడ గీవై – విశ్వ భారతి నుద్ధరింపుమా ॥సంఘ॥