#262క్రైస్తవ సంఘ బాధ్యతలు
Author: ఎమ్. ఎల్. మోజెస్Composer/Ragam: అహిరి (ఛాయ: యేసువంటి ప్రియబంధువు)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును – పరిమళ వాసనగానుండ – ప్రభువు చిత్తమును పరిగణించుటయే – సంఘము నీ బాధ్యతగాదా! ॥ప్రభు॥
1.
దేవుడిచ్చు బహుమానమే బిడ్డలు – గర్భఫలమే మన కిడు స్వాస్థ్యం ఇంపుగ బ్రతిష్టింపను వారిని – సంఘమా – నీ బాధ్యతగాదా? ॥ప్రభు॥
2.
యువకులు రేపటి సంఘము నందున – నాయకులుదురు నయముగాను పావనులుగా నిల జేయను వారిని – సంఘము – నీ బాధ్యతగాదా? ॥ప్రభు॥
3.
బాప్తిస్మమును కృపా ప్రసాదములు – ప్రభు వించెను పరిశుద్ధముగా ఘనముగా వాటిని గైకొన నిరతము – సంఘము – నీ బాధ్యతగాదా! ॥ప్రభు॥
4.
దేవుడు జతపరిచిన దాంపత్యము – భావములర బంధుత్వములున్ – సవ్యముగాసరి చేయగ వాటిని – సంఘమా – నీ బాధ్యతగాదా? ॥ప్రభు॥
5.
పామర జనములు ప్రభు నెరుంగక – పెడ మార్గంబుల దిరుగగను – మానుగ రక్షణమార్గము జూపుట – సంఘమా – నీ బాధ్యతగాదా? ॥ప్రభు॥
6.
క్రైస్తవ దాతృత్వము నందెదుగుట – కర్తను కీర్తించుట యౌను – దశమ భాగములు దాత కొసంగను – సంఘమా – నీ బాధ్యత గాదా? ॥ప్రభు॥