FaithWalk
← Back to Library

#25రక్షణ కొరకు కృతజ్ఞత

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: జంఝూటిCategory: దైవారాధన — దైవస్తుతి
ప
పరలోకమున నుండు దేవ నీ పదముల కొనియాడెద సేవ దురితంబులకు నేను వెరిసి యున్నానని కరుణించి నీ సుతుని ధరణి కంపించితివి గాదా అరుదుగా నీ ప్రేమ ఇంతన దరము గాదో పరమ జనక మరణ పర్యంతంబు నిన్ను నే మరువ జాలను వరకృపా నిధి ॥పరలోకమున॥
1.
యేసు క్రీస్తుని దయచేయకున్న మోసమొందెద నెందుకనగ దోషంబులకు నేను దాసుండనై ప్రతి వాసరంబును నీదు భాసుర రాజసములు విడిచి వేసటలు గల నరకమున బడి ద్రోసినది న్యాయమౌ గద నా సునాథా పేర్మిచేతను నీ సుతుని నంపించినావు ॥పరలోకమున॥
2.
ఎన్నరాని మహిమ నుండి యేసు నన్ను బాలంప నేతెంచి యెన్న శక్యము గాక యున్న పాపము లన్ని ఛిన్నాభిన్నము చేసి నన్ను సమ్మతిపరప నన్ను నగు నా రక్షకుడు తనను తాను అర్పించి వెండియు నున్నతుండై లేచి యిప్పుడు సన్నిధానం బొసగె నాకు ॥పరలోకమున॥