FaithWalk
← Back to Library

#2695వ దావీదు కీర్తన

Author: సమూయేలు పాక్యావాదముComposer/Ragam: శంకరాభరణముCategory: దైవారాధన — దైవస్తుతి
ప
రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ॥రండి॥
1.
రండి కృతజ్ఞతా స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ॥రండి॥
2.
మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్మ్యముగల రాజు భూమ్య గాధపు లోయలను భూధర శిఖరము లాయనవే ॥రండి॥
3.
సముద్రము సృష్టింజె నాయనదే సత్యుని హస్తమే భువి జేసెన్ ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొర్రెలము ॥రండి॥
4.
ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనిన నయ్యవి మన కెంతో మేలగును ॥రండి॥
5.
తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నౌను ఆమేన్ ॥రండి॥