FaithWalk
← Back to Library

#234ఆయన వచ్చు వేళాయెను

Author: చదలవాడ థామస్Composer/Ragam: కల్యాణి (ఛాయ: సంతోషింపరే)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
యేసు వచ్చెడి వేళాయె సోదరులారా – కాశమేఘములతోను – భాసురమగు తన నివాసంబునకు మనల – దీసుకపోవ బ్రకాశితులను జేయ ॥యేసు॥
1.
నిద్రమేల్కొన వేళాయె సమయము తెలిసి – ఓపికతో నుండరే – భద్రముగా శత్రువుపద్రవమును దాటి – సిద్ధపడుడి ప్రభునియొద్ద నివసించుటకు ॥యేసు॥
2.
తనువును బలిపెట్టి మన రక్షకుడు – పునరమహిమలోకి వెళ్ళి – తన యింట స్థలములు మనకు సిద్ధముచేసి – చనుదెంచు వేళాయె కనిపెట్టి యుందాము ॥యేసు॥
3.
చాలారాత్రి గతించెను సోదరులారా – వెలుగు సమీపించెను – వేల దూతలతోడ యేసయ్య వచ్చును – కాల గురుతులగని మేలుకొనరే వేగ ॥యేసు॥
4.
శోధన కాలమిదే యీ ధరణిలో – బాధలు రావచ్చును – నాథుడైన యేసు పాదముల కడనుండ – యేది కీడు చేయలేదు మనపై నెపుడు ॥యేసు॥
5.
మనలను ప్రేమించుచు మన పాపముల – దన రక్తమున గడుగుచు – పున దేవునికి నర్చకులను జేసిన ప్రభుని – కొనియాడి బలమహిమలను జెల్లింతుము నిరత ॥యేసు॥