FaithWalk
← Back to Library

#233క్రీస్తుని రెండవ రాకడ

Author: రావూరి లక్ష్మయ్యComposer/Ragam: పంతువరాళి (ఛాయ: వందనం నీకే)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
వచ్చును క్రీస్తు వచ్చును – భూలోకమునకు – వచ్చును – క్రీస్తు వచ్చును – చచ్చెరను మేఘముల పేర – మిచ్చు బూర సునాదములతో – హెచ్చుగను దూతసమూహము – లచ్చుగను సేవింపగ్రాక్కున ॥వచ్చును॥
1.
అంతటను సకల భూజనులు – వింతగను బూర ధ్వనియు విని – నంతలోనే సజీవులై ప్రభు – చెంత నిల్తురపార మహిమను ॥వచ్చును॥
2.
ఒనరగను దన మేఘ సింహా – సనముపై గూర్చుండి పావన – జనుల బారులు నిరుపార్శ్వము – లను విభజనము చేయు నిక్కము ॥వచ్చును॥
3.
అదను ఇది యని హృదయముల ప్రభు – పెద యుగళసునుతియింతురెరుగక – మద మదురేర్చెడి గెదరు పాపుల – హృదయములు చెదరి భీతిల్లగా ॥వచ్చును॥
4.
అమిత పాపాత్ముల నరకములో – కమున బడద్రోసి సుజన సమూ – హముల దనవెను వెంట గొని చను – విమల నిత్య కిరీటము లొసంగి ॥వచ్చును॥
5.
తల్లి పిల్లల నెడబాసియు – నల్లకల్లోలముగ భువిపై – తల్లడిల్లుచు నొకరి నొక్కరు – నెలకాలము కూడని గడియ ॥వచ్చును॥