#232పాపాత్ముల యొక్క శిక్ష
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: పంతువరాళి (ఛాయ: ఇదిగో గొర్రెల కాపరి)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
కోప దినము వచ్చును – పాపుల గుండె – పగులు కాలము వచ్చును – శ్రీ పాల యేసుని – దాపున జేరక – మాపు రేపులు మహా – పాపులకును గొప్ప ॥కోప॥
1.
భువిలో రాళ్ళ కర్రల – పూజలు చేయు – చవి దేవుండ్లని చెప్పెడి – అవిగాక తమవంటి – నరులదేవుండ్లని – యవివేకముగ నమ్ము – నరులందరికి నెంతో ॥కోప॥
2.
నరహంతకులు దొంగలు – వ్యభిచారులు – మరియ బుద్ధిహీనులందరు ఇరుగు పొరుగు వారి – నింక మోసములు చేయు – నరులందరూ చెడ్డ నరకములో బడునట్టి ॥కోప॥
3.
ఆట పాటలవలనను – పాపము చాల – నట్లాడుకొనువారలు – బూటకముల వారలు – భువిలో యక్షిణీ గాండ్రులు – మాటలాడక యగ్ని – మడుగులో బడి కాలే ॥కోప॥
4.
కులభేదములు గలిగించి – కుటిల మందు – బలముగ బ్రతుకుచుండు – ఇల మాయావాదుల – కింక నేమి గతి లేక – పలు గొరుకులు నుండె – బాధల పాలయ్యెడు ॥కోప॥
5.
మీది దేవునివలనను – ఇయ్యంబడ్డెడు – వేద మొక్కటే సత్యము – ఆధారమైయుండు నాత్మరక్షణ కది – సాధులైనమ్మని భేదకులకు నెంతో ॥కోప॥