#228క్రీస్తు యొక్క రెండవ రాకడ – అవిశ్వాసుల భయము
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: ముఖారి (ఛాయ: హృదయమనేడు)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
నాడు వచ్చినట్లు గాదు – నేడు వచ్చుట – తెరి – చూడరాదు క్రీస్తు నింక – జొత్తు మెచ్చుట ॥నాడు॥
1.
మొదట గొర్రెపిల్ల రీతి – నొదిగి వచ్చెనుగా – ఇప్పుడు – కొదమ సింహమయ్యె మనకు – గుండె దిగులుగా ॥నాడు॥
2.
దాసుని వలె దొల్లి – నిలిచినాడుగా – ఇప్పుడు – దోషము లెంచి దండీంప – దొరయైనాడుగా ॥నాడు॥
3.
ఏ తట్టు బోయిన మనకు – నెదురు వచ్చెనుగా – పిడుగు – రీతి వాని యుగ్రమైన – దృష్టి హెచ్చుగా ॥నాడు॥
4.
కొండ వండలందు దాగి – యుండలేముగా – వాని – యెండనుండి మండు నగ్ని – యదిగో వచ్చెనుగా ॥నాడు॥
5.
దిక్కుగా నున్నట్లు నితర – దేవతలను నమ్మి – నట్టి – పుక్కిటి పురాణములకు బోయి చెడితిమి ॥నాడు॥
6.
వీధుల బోధించు వారి – వినక పోతిమి – ఇప్పుడు – బాధ పొంది నరకాగ్నిలో – బడి బలైతిమి ॥నాడు॥