#229క్రీస్తు మహిమతో వచ్చుట
Author: గొల్లపల్లి నతానియేలుComposer/Ragam: ఘంటాCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
మహిమతో మన యేసు – ఇహమునకు వేంచేయున్ – సహోదరులారా మన మా – మహిమలో వెలుగుదము ॥మహిమతో॥
1.
మోములు వంచి యేసు – నామము నుతియించు – పామరులమైన మనల – బ్రేమతో గప్పినాడు ॥మహిమతో॥
2.
పాత్రులమా మనము – శత్రువులమే కాదా – మిత్రులను జేసినవి – చిత్రము తెలియలేము ॥మహిమతో॥
3.
శిరముల పైని జీవ – కిరీటములతోను – బరము దేవుని వరములు – మురియుచు మరువలేము ॥మహిమతో॥
4.
వీణలతో మనము – నాణ్యమైన పాట – ఋణము చెల్లించలేమని – యణగి మణగి పాడుదము ॥మహిమతో॥