#227క్రీస్తు రెండవ రాకడ
Author: మిక్కిలి నమూయేలుComposer/Ragam: కమలామనోహరిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
కోలాహలముగా – గారిమితో గూడి – కోలాటమాడను రార – మా – పాలిటి యేసుని పేర – మా పాలిటి యేసుని పేర – మ – మ్మేలెడి దేవుని పేర ॥కోలాహలముగా॥
1.
మా స్వామి యా మోక్ష – వాసుండనైనట్టి – యేసయ్య పోకను జూడు – మా యేసయ్య రాకను పాడు – యేసయ్య రాకను పాడు – నీ హొసన్న – యని మదివేడు ॥కోలాహలముగా॥
2.
పాపంబులను మోసి – ప్రాణంబు బలి యిచ్చి – తా బరమున కేగలేదా – నీ – జ్ఞాపకములోనికి రాదా – జ్ఞాపకములోనికి రాదా – నీ ప్రాపకుడై యుండలేదా ॥కోలాహలముగా॥
3.
ఏలినవాడైన – యేసుని రాకను – నాలించి చూడవదారే – నిను పాలించువాడనుకోర – పాలించువాడనుకోర – పరి – శీలించువాడనుకోర ॥కోలాహలముగా॥
4.
అంతముచే భువి – కా యేసు నాథుండు – చెంతను దూతలతోడ – బల్ – వింతగ వచ్చును జూడు – వింతగ వచ్చును జూడు – న – త్యంత బలముతోడ రాడు ॥కోలాహలముగా॥
5.
ఆకాశ భూమ్యాదు – లార్భటములు దూతల – మూకలతో గూడినాడు – ఈ లోకానికి తెంచువాడు – లోకానికి తెంచువాడు – ఇంక వీక్షతో ప్రభుని పాడు ॥కోలాహలముగా॥
6.
భీకర సింహపు – టాకారముతోను – ఢీకొని మేఘములతోడ – బల్ – బాకారములు పాడు – బాకారంబులు పాడు – నిటు – డీకొని వచ్చెను జూడు ॥కోలాహలముగా॥
7.
భాసురమైనట్టి – యేసయ్య రాకను – ఈ సూర్యుడు చూడలేడు – తన వి – కాసము చీకటౌను వి – కాసము చీకటౌను – నీ కాసు గతి నెంచువాడు ॥కోలాహలముగా॥