FaithWalk
← Back to Library

#22దేవుని ప్రభావ వర్ణన

Author: మిక్కిలి సమూయేలుComposer/Ragam: నాట (ఛాయ: యేసు క్రీస్తు దొరికె ననికి)Category: దైవారాధన — దైవస్తుతి
ప
వ్యోమ సింహాసనస్థుడా ఉర్వి పాదపీఠస్థుడా మామకీన దయామయుడా మమ్ము గావుమా దేవుడా ॥వ్యోమ॥
1.
అంతరిక్ష లోకదీప యద్భుతాదృశ్య స్వరూపా ఇంత నీ మహిమ నోప నెంతకైనా నా నాలుక చూప ॥వ్యోమ॥
2.
గాలి రెక్కల పై నెక్కి గాఢాంధకారమునందు నేలికవై సంచరించు నట్టి నిన్ను మ్రొక్కుచుందు ॥వ్యోమ॥
3.
నీతి న్యాయ దీర్ఘశాంతా నిర్మల దయా నితాంతా ప్రీతి నుంచవే శ్రీమంతా పెద్దగా నా కాలమంతా ॥వ్యోమ॥
4.
సర్వ భూలోక పూజితా సత్య సద్గుణ రాజితా గర్వ దుస్స్వభావ హరితా కావునన్నిన్ని నాట పితా ॥వ్యోమ॥
5.
నమ్మిన యీ నన్ను దూల నాడవు దీనాత్మపాలా క్రిమ్మి నీ ప్రేమతో జాల బ్రోతువు దయాలా వాలా ॥వ్యోమ॥