FaithWalk
← Back to Library

#21త్రిత్వమునకు స్తుతి

Author: UnknownComposer/Ragam: కాంభోజి (ఛాయ: యేసు నీ నామామృతము)Category: దైవారాధన — దైవస్తుతి
ప
త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా నీ సత్య సామర్థ్యత్వముల నిజ తత్వము గణించి నిన్ను నిత్యము స్తుతియించెదను ॥త్రిత్వమై॥
1.
ఎల్ల లోకంబుల సృజించిన చల్లని తండ్రి నా యులమున నీ గొప్ప వింతలెల్ల సంతోసిల్ల శోభిల్ల దలంచెదను ॥త్రిత్వమై॥
2.
వాసి కెక్కిన పరమ రాజ్య నివాసమును విడిచిన శ్రీ యేసు నాథుండను కుమారా దోషముల దోషంబు లెల్ల గాచి రక్షించినావు ॥త్రిత్వమై॥
3.
ఆదరణకారుండవగు శుద్ధాత్ముడా దేవా యా మోద నామము నంపబడి యేసు నాథుని సుబోధ లెల్ల బోధపరచి పాదుకొలిపి ॥త్రిత్వమై॥
4.
ఓ పితా సుతా శుద్ధాత్మా ఒక్క దేవుడవు ఎల్ల పాపులను రక్షింప మిగుల నోపికతో నాపదలు బాపి కృప చూపినావు ॥త్రిత్వమై॥