FaithWalk
← Back to Library

#202సిలువ ధ్యానము

Author: పంతగాని పరదేశిComposer/Ragam: సురటిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
కదలమెదలక ఆశ్చర్యముతో, శ్రమలు. కరము పట్టి దరిని జేర్చి – వరములిడి దీవించిన యా కరుణగల చేతులలో చీల – గుచ్చెదరేల ||కల్వరి తీరు||
1.
ప్రేమ, కృప, నిర్మలత్వమును – నియమమును గల మోముపై యా పామరులుమి వేసెదరేల – పాటించరేల ||కల్వరి తీరు||
2.
ఘోర యాతనలను నీదు – క్రూర మరణము చూడ గుండె నీరునీరై పోవదే దేవా – క్రూరునికైన ||కల్వరి తీరు||
3.
పాపమేమి చేసి యెరుగవు – పావన పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి యింత – ఉత్కట బాధ ||కల్వరి తీరు||
4.
స్వామి మాకై పూటపడితివి నీ – ప్రేమయే कारणము నిజము భూమి యది గుర్తింపగ నిమ్ము – పూజ్యుడవు దేవా ||కల్వరి తీరు||
5.
పావనాత్మ నీవు జావ – పాపి కబ్బును నిత్య జీవ మా వచన సత్యంబు దెల్పుము – మానవాళికిన్ ||కల్వరి తీరు||
6.
సిలువ దరి కాపాడించుము – ఖలుడను ఘోరపాపిని కల్మషములు విడ శక్తినీయుము – సిలువ ధ్యానమున ||కల్వరి తీరు||