#201యేసు శాంతికరుడు
Author: చెట్టిభానుమూర్తిComposer/Ragam: శ్యామ (ఛాయ: శాంతము లేక)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
కల్వరి మెట్టపై – కల్వరి మెట్టదో – సిలువపై నోర్చితివో – పలుశ్రమ లొందితి – ప్రాణము బెట్టితి ||కల్వరి||
1.
తులువలు చేరి నిన్ – తలపడి మొత్తిరో – అలసితి సొలసితి – నాత్మను గుందితి ||కల్వరి||
2.
పాపులకొరకై – ప్రాణముబెట్టితి – ప్రేమది యెట్టిదో – నామది కందదు ||కల్వరి||
3.
దారుణ పాప – భారము మోసితి – దీనుల – రక్షణ దానమైతివి గద ||కల్వరి||
4.
జనకున కభీష్టమున్ – చక్కగ నెరపితి – జనముల బ్రోవనీ – జీవము నిచ్చితి ||కల్వరి||
5.
శాంతిని గోరితి – శాంతము నెరిగిన – భ్రాంతియె గాని వి – శ్రాంతి నెరుగుదురు? ||కల్వరి||